అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ 3 : నీలాయంపాలెం విజయ్ కుమార్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక చెప్పిందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. అప్పులు తీసుకోవడంలో రాష్ట్రం మన దేశంలోనే టాప్ 3లో ఉన్నట్టు ఆయన తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కలిసి ఆర్బీఐ ద్వారా చేసిన రుణాలు 88.4 శాతం అయితే.. ఏపీ ఒక్కటే 11.6 శాతం అప్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు.

విద్యారంగంలో టీడీపీ హయాం కంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఖర్చు పెట్టేది తక్కువ. బడ్జెట్ లో విద్యారంగం అభివృద్ధికి ఖర్చు చేసింది. 11.7 శాతమే. ఈ కేటాయింపుల్లో ఏపీ 24వ స్థానంలో ఉంది. మరోవైపు ఆరోగ్య శ్రీ కింద ఆసుపత్రులకు నిధులు ఇవ్వడం లేదు. వైద్య రంగంలో మూడేళ్లుగా బడ్జెట్ లో 5.6 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు. వైద్య రంగంలో ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేసే రాష్ట్రాల్లో ఏపీ 18వ స్థానంలో ఉందని విజయ్ కుమార్ తెలిపారు. మౌలిక వసతులకు గత ఏడాది పెట్టిన ఖర్చు రూ.16వేల కోట్లేనని చెప్పిన ఆయన.. కేటాయింపుల్లో 15వ స్థానంలో ఉన్నట్టు గుర్తు చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 33.5 శాతం కాగా.. రాష్ట్ర ఆదాయంలో 13.9 శాతం వడ్డేకే సరిపోతుందని వివరించారు విజయ్ కుమార్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version