రేషన్ కార్డుదారులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్

-

Chandrababu government good news for ration card holders: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులు ఉన్న వారికి జులై నుంచి రాగులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది.

Chandrababu government good news for ration card holders

ప్రస్తుతం రాయలసీమలో మాత్రమే వీటిని పంపిణీ చేస్తుండగా.. మిగతా జిల్లాలకు విస్తరించనుంది. మూడు కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అలాగే సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లా ప్రజలకు జులై నుంచి జొన్నలు కూడా అందివ్వనున్నారు.

కాగా, వచ్చే నెల (జులై) మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో ఆగస్టు 2024 నుంచి మార్చి 2025 వరకు అవసరమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. ఆమోదం తెలపడానికి ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించనున్నారు.. అయితే, త్వరలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news