తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారికి దర్శనానికి భక్తులు.. 31 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. అటు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 72,650 మంది భక్తులు ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజు 27,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజు హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు గా నమోదు అయింది.
కాగా, తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. శ్రీవారి వాహన సేవలో పాల్గొంటూ భక్తులు పారవశ్యం పొందుతున్నారు. ఆ వేంకటేశ్వరుని నామస్మరణతో తిరుమాఢవీధులన్నీ మార్మోగుతున్నాయి. ఎటుచూసినా ఆధ్యాత్మక భావంతో ఆ ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలుగులీనుతోంది.తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రోజున శ్రీవారికి మధ్య హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు.