ఏపీలో నిన్న 2 ఓమిక్రాన్ కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ విస్త‌రిస్తుంది. శ‌నివారం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు శ‌నివారం రాత్రి ప్ర‌క‌టించారు. కాగ రాష్ట్రంలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన వ్య‌క్తి ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చాడ‌ని తెలిపారు. అత‌నికి టెస్టులు జ‌ర‌ప‌గా ఓమిక్రాన్ అని తెలింద‌ని వెల్ల‌డించారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన మ‌రో వ్య‌క్తి కొద్ది రోజుల క్రితం యూకే నుంచి వ‌చ్చాడ‌ని తెలిపారు.

అత‌ని కరోనా ల‌క్ష‌ణాలు ఉంటే.. శాంపిల్స్ ను ప‌రీక్షించ‌గా ఓమిక్రాన్ గా తెలింద‌ని తెలిపారు. కాగ వీటితో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంటు కేసుల సంఖ్య 6 కు చేరాయని తెలిపారు. అయితే విదేశాల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి 67 మంది వ‌చ్చార‌ని తెలిపారు. అందులో 12 మందికి క‌రోనా వైర‌స్ సోకింద‌ని తెలిపారు. కాగ ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్న నేప‌థ్యం లో రాష్ట్ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. అంద‌రూ రెండు డోసుల టీకా తీసుకుని.. కరోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version