తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీ వారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని నిండి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచివున్నారు.
ఇక టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 66,233 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్క రోజే 36,486 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే.. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.71 కోట్లు గా నమోదు అయినట్లు టీటీడీ అధికారులు అధికారిక ప్రకటన చేశారు.
కాగా,టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సనాతన హిందూ ధర్మాన్ని విస్తరించడంలో భాగంగా కోటి భగవద్గీత పుస్తకాలను తెలుగు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ముద్రించి విద్యార్థులకు ఫ్రీగా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.