మంగళగిరిలో నీ భర్తకు ఎప్పుడో మోత మోగించారు – బ్రహ్మాణిపై రోజా సెటైర్లు

-

మంగళగిరిలో నీ భర్తకు ఎప్పుడో మోత మోగించారని నారా బ్రహ్మాణిపై రోజా సెటైర్లు వేశారు. నేడు చంద్రబాబుకు మద్దతుగా “మోత మోగిద్దాం” నిర్వహించనుంది టీడీపీ పార్టీ. నేడు చంద్రబాబు కు మద్దతుగా రాత్రి 7:00 నుండి 5 నిమిషాలు పాటు మోత మోగిద్దాం అంటూ ఆందోళనకు టిడిపి శ్రేణులకు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు.

roja comments again on cbn family

చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దామని… తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దామని ఈ “మోత మోగిద్దాం” కార్యక్రమంలో భాగంగా నినాదాలు ఇవ్వాలని టిడిపి శ్రేణులకు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు.

అయితే.. “మోత మోగిద్దాం” కార్యక్రమంపై రోజా స్పందించారు. ఇదెక్కడి విడ్డురం? మీ మామ మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లోనే మోత మోగించి 23 సీట్లతో ఇంటికి పంపించారని బ్రహ్మాణిపై మండిపడ్డారు. మీ భర్త నారా లోకేష్‌ ను మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా..? అంటూ ఆగ్రహించారు రోజా. మీ ఫామిలీ ఫ్యామిలీ అంతా కాపీ కొట్టడమేనా..? అని ఫైర్‌ అయ్యారు రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version