శ్రీకాకుళం జిల్లా లో నీలి తిమింగల కలకలం రపింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.
కాగా, ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనివల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు తప్పిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బలహీనపడిన అల్పపీడనం ఉత్తర కోస్తాపై కేంద్రీకృతమైంది. దీనివల్ల కొన్ని చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.