రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశం జరుగుతుందన్నారు వై.సి.పి.నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో మీడియాతో వై.సి.పి.నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలోని వెంకతగిరిలో గ్రామ శక్తి పోలేరమ్మ జాతరను ముఖ్యమంత్రి జగన్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు.
1 నుంచి 5 వరకూ అంగరంగ వైభవంగా జాతర జరిగింది….4 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చారని తెలిపారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ దర్శనం క్షల్పించామని వెల్లడించారు వై.సి.పి.నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.
అందరూ సంతృప్తిని వ్యక్తం చేయడం సంతోషాన్నిచ్చిందని…చిన్న పొరపాట్లు వున్నా వాటిని గుర్తించి. వచ్చే ఏడాదికి సరిచేస్తామని ప్రకటించారు. విజయవాడలో వై.సి.పి.ప్రజా ప్రతినిధుల సదస్సు జరిగిందని.. పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేశారన్నారు. వచ్చే ఆరు నెలల్లో ప్రజల్లోకి మరింత వెళతామని వెల్లడించారు వై.సి.పి.నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశం జరుగుతుందని..పేదలందరికీ ఇళ్లు అనేది ఇది విప్లవాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.