అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం

-

అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం కలకలం రేపింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం బయటపడింది. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, శాంతినగర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

The nutritious food provided at the Anganwadi center includes snake carcass

పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పి చూస్తే పాము కనిపించడంతో గర్భిణి ఒక్కసారి షాక్ నకు గురైంది. ఈ తరునంలోనే… అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలి ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచార మిచ్చామన్నారు సీడీపీఓ. అయితే.. అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం కలకలం రేపడం లో అధికారుల నిర్లక్ష్యం ఉందని సామాన్యులు ఫైర్‌ అవుతున్నారు. ఇలాంటి ఆహారం పెడితే.. గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంటనీ ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version