ఏపీలో స్వల్పంగా పెరిగిన క‌రోనా ..నేడు కొత్త‌గా 5 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ దాదాపు పూర్తిగా త‌గ్గింది. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కేవ‌లం సింగిల్ డిజిట్ కు ప‌రిమితం అవుతున్నాయి. అయితే రాష్ట్రంలో నిన్న‌టితో పోలిస్తే.. నేడు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. కాగ నేటి క‌రోనా బులిటెన్ కొత్త జిల్లాల ప్ర‌కారం విడుద‌ల చేశారు.

ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాగ నిన్న 3 కేసులు మాత్ర‌మే వెలుగు చూశాయి. విశాఖ ప‌ట్నంలో 2, తిరుప‌తి, నెల్లూర్, ప‌ల్నాడు జిల్లాల్లో ఒక్కో కేసు న‌మోదు అయింది.

అలాగే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 6 గురు క‌రోనా వైర‌స్ బాధితేలు పూర్తిగా కోలుకున్నారు. కాగ నేడు రాష్ట్రంలో ఎలాంటి క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 3,956 క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version