మరో 5 వేల కోట్ల అప్పు చేయనున్న జగన్ సర్కార్ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఇప్పటికే 37వేల కోట్ల రూపాయల అప్పులు చేయగా, మరో ఐదు వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం విస్మయాన్ని కలిగించిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటూ, కార్పొరేషన్ పేరిట చేసిన అప్పు కూడా ప్రభుత్వం చేసిన అప్పుగానే పరిగణించబడుతుందని నిబంధనలు చెబుతున్నాయని, ఈ విషయాన్ని ఇప్పటికే పలుసార్లు తాను పేర్కొనడం జరిగిందని అన్నారు.

గత ప్రభుత్వ హయాములో సివిల్ సప్లై కార్పోరేషన్ కేవలం 18 వేల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చేసిందని, ధాన్యం విక్రయించిన రైతులకు అప్పుడు సకాలంలో డబ్బులు చెల్లించేవారని, కానీ ఇప్పుడు నాలుగైదు నెలలైనా ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. అయినా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ కు ఐదువేల కోట్ల రూపాయలు అప్పిచ్చే బ్యాంకులు, 37 వేల కోట్ల రూపాయలు ఏమి చేశారని ప్రశ్నించాలని, అమ్మ ఒడి పథకాన్ని గతంలో జనవరిలోనే అమలు చేసేవారని, కానీ చివరి సంవత్సరం అమ్మ ఒడి పథకాన్ని తప్పించుకునేందుకు జూన్ లో ఇస్తామని చెప్పారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version