ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలోనే 500 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేవాదాయ శాఖలోని పలు క్యాడర్లలో 500 పోస్టులు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది.
త్వరలోనే దేవాలయ ట్రస్ట్ బోర్డుల నియామక ప్రక్రియ కూడా ఉంటుందని వివరించారు ఆనం రాం నారాయణరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో.. ఏ గ్రేడ్ ప్రసాదాల పంపిణీ ఉంటుందని వివరించారు. కల్తీ కి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆలయాలలో వ్యాపారాలు ఎక్కువ జరిగాయని… కూటమి ప్రభుత్వంలో అలాంటి సంఘటనలు ఉండబోవని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దేవాలయాలు అంటే ఆధ్యాత్మిక చింతనతో జనాలు వచ్చేలా… చేస్తామని ప్రకటించారు.