తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కాకుండా కేవలం…. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డిపాదయాత్ర చేస్తారు. ఈ పాదయాత్రకు మూసి పునర్జీవ సంకల్పయాత్ర అని పెట్టారు. దీని ప్రకారం ఇవాళ ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు.
అనంతరం అక్కడి నుంచి సంగెం ప్రాంతానికి చేరుకుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అక్కడి నుంచి భీమ లింగంలోని మూసి నది వరకు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డి పల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం- నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహిస్తారు రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడే రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ఉంటుంది. ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అన్న సంగతి తెలిసిందే. అందుకే యాదాద్రికి వెళుతున్నారు.