కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తెలంగాణ బీజేపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు కుటుంబ, అవినీతి పార్టీలే అని విమర్శించారు. తెలంగాణలో ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే.. ఆయా స్థానాల్లో బీజేపీదే విజయం అని జోస్యం చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని కీలక ప్రకటన చేశారు.
బీసీలలో ముస్లింలను చేర్చడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఏప్రిల్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేక విపక్ష నేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పని చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలలో ఎవ్వరికీ పరిపాలనలో అవగాహన లేదన్నారు.