గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నా.. అక్రమార్కులు అడ్డదారుల్లో భారీగా తరలించేస్తున్నారు. విచ్చలవిడిగా గంజాయి విక్రయించి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. పోలీసుల కప్పి ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు యధేచ్చగా తరలిస్తున్నారు. ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా రాష్ట్ర ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో నిఘాను పటిష్టం చేశారు. ఎక్కడికక్కడ గంజాయి తరలింపును కట్టడి చేస్తున్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలీసులు తనిఖీలు చేశారు. వాహనంలో తరలిస్తున్న 630 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 9 మందిని అరెస్ట్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి తరలింపు చట్ట రీత్యా నేరమని చెప్పారు. ఎవరూ కూడా చట్ట విరుద్ధమైన పనులు చేయొద్దన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.