ఏపీలో 66 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి

-

ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ లో పనిచేస్తున్న 66 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇచ్చింది సర్కార్‌.  ఏపీలో 66 మంది తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం జీవోఎంఎస్ నంబర్ 747 జారీ చేశారు.

వివిధ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారుల అవసరం పెరగడం, కొత్తగా 24 రెవెన్యూ డివిజన్ కేంద్రాల ఏర్పాటు, జిల్లాల పూనర్వివిభజన నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 66 కొత్త డిప్యూటీ కలెక్టర్ పోస్టులను మంజూరు చేసింది.

ప్రస్తుతం జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దారులు, రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేస్తున్న సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్ లకు పదోన్నతులు ఇచ్చి ఈ పోస్టుల్ని భర్తీ చేసింది. పదోన్నతుల కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లను ఎంపికచేసి 198 మందితో 2022-23 సంవత్సరం అడ్ హాక్ ప్యానల్ తయారు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version