ఇలాంటి పరిస్థితిని అస్సలు ఊహించని విజయ్..!!

-

విజయ్‌ దేవరకొండ హీరోగా.. మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్‌, పూరీ జగన్నాథ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌కు , మంచి హిట్ కొట్టి పాన్ ఇండియా డైరెక్టర్ కావాలను కున్న పూరీ జగన్నాథ్ కు దెబ్బపడింది.

ఇక ఈ సినిమా నిర్మాత గా వ్యహరించిన ఛార్మి కౌర్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. వీరు ఏదో అనుకొని తీస్తే అది మరోలా రిజల్ట్ ఇచ్చింది. ఇక తర్వాత జరిగిన డిస్టి బ్యూటర్స్  రచ్చ , పూరీ జగన్నాథ్ ఒపెన్ లెటర్ రాయటం వంటి పెద్ద ఎపిసోడ్ నడిచిన సంగతి తెలిసిందే.  తర్వాత వారిని ఈడి డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి విచారించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Puri Jagannath Vijay Devarakonda New Movie Title Fighter

ఇక లైగర్ సినిమా తర్వాత విజయ్ కొన్ని రోజుల పాటు ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక సమంత కు అనారోగ్యం తో ఉండటం వలన మళ్లీ ఖాళీ అయ్యాడు. ప్రస్తుతం తన చేతిలో సినిమా లేదు. లైగర్ సినిమా కోసం తీసుకున్న డబ్భులు కొన్ని వెనక్కి ఇచ్చాడు. రీసెంట్ గా కొత్త ఇల్లు తీసుకున్నాడు. దాని అప్పులు భారీ గా ఉన్నాయట.లైగర్ తర్వాత వరుసగా సినిమాలు వస్తాయని అంచనా వేశాడు కాని అది అసలకే దెబ్బ వేసింది. ఇప్పుడు సమంత కూడా ఖుషి సినిమా షూటింగ్ కు మరో నెల రోజులు రానని చెప్పిందట. దానితో విజయ్ దిక్కు తోచని స్థితిలో పడ్డాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version