వైసీపీకి షాక్… కడప లో ఏడు మంది కార్పొరేటర్ల జంప్..!

-

ఎన్నికల్లో ఓడిన తర్వాత నుండి వైసీపీ పార్టీకి వరుస షాక్ లు తలూగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో బిగ్ షాక్ కూడా తగిలింది. కడప కార్పొరేషన్ లో ఏడు మంది కార్పొరేటర్ లు జంప్ అయ్యారు. వచ్చే సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు కార్పొరేటర్లు. ఈ క్రమంలో వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చర్చలు జరిపారు.

అయితే కడప నగరంలోని అలంకానపల్లెలో ఈరోజు సాయంత్రం మున్సిపల్ కార్పొరేటర్లతో ఎంపీ సమావేశం ఏర్పాటు చేసారు. కానీ అవినాష్ రెడ్డి సమావేశానికి ఆ అసంతృప్తి కార్పొరేటర్లు హాజరు కాలేదు. గత రెండు నెలల క్రితం వైసీపీని వీడి టీడీపీలో చేరారు 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ. కార్పొరేషన్ లో కుర్చీల గోల తర్వాత అసంతృప్తి కార్పొరేటర్ల పై దృష్టి సారించింది టీడీపీ. అయితే ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీకి ఇద్దరు కార్పొరేటర్ లు మాత్రమే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version