వైఎస్‌ఆర్‌సీపీ నేత నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. నూజివీడు కో తాజాగా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మల్లవల్లి భూముల్లో తమకు రావాల్సిన పరిహారం వల్లభనేని వంశీ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా.. హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ విచారణ జరిపిన నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే, వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ వచ్చినా ఆయన జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనపై నమోదైన మరికొన్ని కేసుల్లో వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడ జిల్లా కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే రేపు తీర్పు రానుంది.