వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అది భారతదేశ ఐక్యత పై జరిగిన దాడి అని అభివర్ణించారు. వక్ఫ్ భూములు కాజేసేందుకే ఈ సవరణ బిల్లు అని షర్మిల విమర్శించారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మతస్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లుతో మైనార్టీలను అణచివేసే కుట్రకు ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. దేశ చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగులుతుందని షర్మిల విమర్శించారు.
మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై షర్మిల స్పందించారు. ఆ కేసులో వరసుగా సాక్షులు చనిపోతున్నారని పేర్కొన్నారు. సునిత ప్రాణాలకు ముప్పు ఉందని షర్మిల వెల్లడించారు. సునితకు ఇద్దరూ పిల్లలు ఉన్నారని.. ఆమె ప్రాణాలకు రక్షణ లేదని తెలిపారు. ఈ కేసు నిందితుడు అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు షర్మిల. వివేకా హత్య కేసులో వైఎస్ సునిత కు ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం తనకు కలుగుతుందని షర్మిల తెలిపారు.