ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు : సీఈవో ముఖేష్ కుమార్ మీనా

-

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగినటువంటి 4 దశల ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ లోనే నమోదు అయిందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో మొత్తం 81.86 శాతం ఓట్లు పోలైనట్టు ఆయన మీడియా సమావేశంలో తుది పోలింగ్ శాతం వివరాలను వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, మిగతా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్టు తెలిపారు. 2014లో 78.41 శాతం , 2019లో 79.77 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు ముఖేష్ కుమార్ మీనా.

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.12 శాతం పోలింగ్ నమోదు అయింది. కుప్పంలో 89.88 శాతం పోలింగ్ నమోదు అయింది. నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  అత్యధికంగా దర్శిలో 90.91 శాతం పోలింగ్ నమోదు అయింది. 63.32 శాతం తిరుపతిలో అత్యల్పంగా పోలింగ్ జరిగింది. త్వరలోనే ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తాం. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆయా పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటల వరకు అక్కడే ఉండవచ్చు అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version