విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారిని ప్రపంచంలో అనేక రకాలుగా వాతావారణం, అనుకూలం లేని పరిస్దితులు, కరోనా నుండి బయటపడ్డాం మరలా ఇలాంటి పరిస్థితులు రాకుడదని కోరుకున్నానని తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని కోరుకున్నానన్నారు.
గతంలో వృద్ధులు మాత్రమే దేవాలయాలకు వచ్చేవారని.. నేడు యువతంతా దేవాలయాలకు వస్తున్నారని అన్నారు. అమ్మవారు సమస్త ప్రజలను దయతో చూడాలని కోరుకున్నట్లు వివరించారు. ప్రసాద్ టూరిజం లో భాగంగా అమరావతికి వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించామన్నారు. అన్నవరం, సింహాచలం, నెల్లూరు లక్ష్మి నరసింహ దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. దేశంలో 156 దేవాలయాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ కి రైల్వే బడ్జెట్ లో 8600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ – షిరిడి ఎక్స్ప్రెస్, మచిలీపట్నం వరకు. విజయవాడ – హుబ్లీ ఎక్స్ప్రెస్ నరసాపురం వరకు, నంద్యాల – కడప ఎక్స్ప్రెస్ రేణిగుంట వరకు, విశాఖ – కాచిగూడ రైలులో మహబూబ్నగర్ వరకు, విశాఖ – విజయవాడ ఎక్స్ప్రెస్ గుంటూరు వరకు పొడిగిస్తామన్నారు. అలాగే త్వరలో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ రైలు వస్తుందని వెల్లడించారు.