ఏపీలో విషాదం చౌటు చేసుకుంది. ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి చెందారు. ఈ సంఘటన ఇంకా వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి చెందారు. మృతురాలు పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన కట్టా దుర్గా మల్లేశ్వరి(27) గా పోలీసులు గుర్తించారు.
జనరల్ చెకప్ కోసం నిన్న ఆసుపత్రికి మల్లేశ్వరి వెళ్లారు. ఉమ్ము నీరు తక్కువగా ఉండటంతో టెస్టులు చేసి ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది వైద్యురాలు. ఈ తరుణంలోనే ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మృతి చెందారు గర్భిణి మల్లేశ్వరి. ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దింతో కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజీ రోడ్డులో నిరసనకు దిగారు.