విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనలో యూట్యూబర్ పై కేసు నమోదు !

-

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 60 కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తు న్నారు. అయితే…విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఓ యూట్యూబర్ పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు.

నిన్న రాత్రి ఫిషింగ్ హార్బర్ లో లంగర్ వేసి ఉన్న బోటులో యూట్యూబర్ పార్టీ ఇచ్చాడు. ఆ సమయంలో మద్యం మత్తులో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనలో అర్ధరాత్రి గాడ నిద్రలో ఉన్న గంగపుత్రులు అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయారనుకున్నారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ ప్రమాద ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లడంతో జాలర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి చెందారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి సిదిరికి ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version