టీడీపీ కేసులు పెడుతున్న తరుణంలోనే వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పొడిగించారు. ఈ నెల 23 వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు వైసీపీ నేతలు సజ్జల, నందిగామ సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్.
ఈ తరుణంలోనే…టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పొడిగించారు. తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేశారు. ఇక అటు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా భారీ ఊరట లభించింది. మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పొడిగించారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్లారని నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని జోగి పిటిషన్ వేశారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా భారీ ఊరట లభించింది. ఈ నెల 23కి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు.