ఏపీ రిటైర్డ్‌ ఉద్యోగులకు శుభవార్త..పెన్షన్‌ చెల్లింపులపై కీలక నిర్ణయం

-

అమరావతి : ఏపీ నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఈ మేరకు రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను నిర్దారిస్తూ జీవోలు విడుదల చేసింది సర్కార్‌. 70 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 7 శాతం పెన్షన్‌, 75 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 12 శాతం పెన్షన్‌ చెల్లిస్తామని ప్రకటన చేసింది సర్కార్‌.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

80 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 20 శాతం పెన్షన్‌ ఇవ్వాలని.. 85 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 25 శాతం పెన్షన్‌ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. 90 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 30 శాతం పెన్షన్‌, 95 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 35 శాతం పెన్షన్‌ చెల్లించనుంది. 100 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 50 శాతం పెన్షన్‌ చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్‌.

అటు 2022 జనవరి నుంచి కొత్త వేతన స్కేళ్లను అమల్లోకి వచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం.11 వ పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలు, పెన్షన్లను నిర్దారిస్తూ ఆదేశాలు జారీ చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్. జనవరి 2022 నెలకు చెల్లించిన వేతనాల్లో హెచ్చుతగ్గులను సవరిస్తామని పేర్కొంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news