మాజీ ఎమ్మెల్యే కన్నబాబు ఇంట్లో భారీ దొంగతనం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఇంట్లో చోరీ జరిగింది. రాంబిల్లి లోని యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఇంట్లోని పూజామందిరంలోని వెండి సామగ్రీ అపహరణ చేశారు. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఇంటి సమీపంలోని హెచ్.పి.గ్యాస్ ఆఫీసులో 40 వేలు ఎత్తుకెళ్లారు దొంగలు.
ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇక సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తూన్నారు పోలీసులు. కాగా యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఇంట్లో భారీ దొంగతనంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.