విశాఖ పట్నంలో మేయర్ పై అవిశ్వాసం తీర్మాణం నోటీసుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. GVMV ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కయ్యారు. అవిశ్వాసం పై ఓటింగ్ కోసం కాకుండా తీర్మాణం కోసం సమావేవం పెట్టామని సమాచారం. దీంతో మేయర్ పై GVMC అవిశ్వాసం అంటూ నోటీసులు ఇవ్వడం పై వైసీపీ కార్పొరేటర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
కమిషనర్ పేరుతో అందిన లేఖలు అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాణం నోటీసులపై సంతకాలు పెట్టారని.. వాటిని జత చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తనకు అందిన అజెండాలో సభ్యులు సంతకాలతో కూడిన కాపీ ఇవ్వలేదంటున్నారు కార్పొరేటర్లు.