ప్రతీ ఏడాది ఏప్రిల్ 05వ తేదీన ప్రముఖ జాతీయ నాయకుడు సామాజిక న్యాయం కోసం పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించుకుంటామనే విషయం తెలిసిందే. బాబుజీ అని ముద్దుగా పిలవబడే ఆయన జీవితం.. సందేశాలు తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉన్నాయి. సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు.
ఈ నేపథ్యంలో “భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్పూర్తివంతమైన సేవలు అందించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ అభ్యుదయ నాయకుని స్మృతికి నివాళులు. తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబుజీ స్పూర్తిగా మనందరం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. బాబు జగ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దాం” అని సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.