తెలుగు జవాన్ మృతి చెందాడు. దేశ రక్షణలో తెలుగు జవాన్..అమరుడయ్యాడు. భారత్-పాక్ యుద్ధంలో ప్రాణాలర్పించాడు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన విడుదల అయింది. ఎక్స్ వేదికగా మురళీ నాయక్ కు సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు.

దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం అని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తెలిపారు.