భారత్ నిన్న రాత్రి పాకిస్తాన్ లోని కీలక నగరాల మీద విరుచుకపడటంతో ఆ దేశం ఆర్థికంగా చితికిపోయినట్లు సమాచారం.దీంతో శుక్రవారం ఉదయం తమకు రుణ సహాయం చేయాలని అంతర్జాతీయ సంస్థలను, దేశాలను వేడుకుంటూ పాక్ అధికార ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ప్లేటు ఫిరాయించిన పాకిస్తాన్ ఆ ట్వీట్ తాము చేయలేదని బుకాయించే ప్రయత్నం చేసింది. ఇందులో భారత్ ప్రమేయం ఉందనని విమర్శలు గుప్పించే ప్రయత్నం చేసింది. దీంతో ప్రపంచం ఎదుటే దాయాది చులకన అయిపోయింది.తాము రుణాల కోసం ఎలాంటి పోస్టు పెట్టలేదని.. తమ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని పాక్ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఈ విషయాన్ని సమర్థించుకొనేందుకు ‘ఫ్యాక్ట్ చెక్’ చేసినట్లు ఆ దేశ సమాచార శాఖ తాజాగా ఓ పోస్టు పెట్టడం విమర్శల పాలు చేసింది.