విశాఖలో మహిళపై కిరాతకంగా వ్యవహరించారు. ముగ్గురు వ్యక్తులు నడి రోడ్డుపై మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చి కెళ్లారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విశాఖలోని మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తోంది ఓ మహిళ. అయితే… పక్కనే ఉన్న దుకాణదారులు ఆమెను జుట్టుపట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకుని వెళ్లారు.
అద్దె విషయంలో యజమాని .. ఆమెపై దాడి చేశారని సమాచారం అందుతోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
విశాఖలో మహిళపై కిరాతకం
ముగ్గురు వ్యక్తులు నడి రోడ్డుపై మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చి కెళ్లిన వైనం
మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తోన్న మహిళ
పక్కనే ఉన్న దుకాణదారులు ఆమెను జుట్టుపట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకుని వెళ్లారు..
అద్దె విషయంలో యజమాని… pic.twitter.com/fAVXC7UjJE
— Pulse News (@PulseNewsTelugu) January 27, 2025