తెలంగాణ ఇచ్చే పథకాలకు దావూద్ ఇబ్రహీమ్ అని పెట్టుకోండి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. సొమ్ము ఒకరది సోకు మరొకరిదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర నిధులతో పథకాలకు ఇందిరాగాంధీ, ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీమ్ అని పెట్టుకోండి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులుతో వచ్చే పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదన్నారు. నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వం.. పేరు మార్చుకుని మరో పెట్టుకునేది రాష్ట్ర ప్రభుత్వాలా? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
గద్దర్ కు బరాబర్ పద్మశ్రీ ఇవ్వం అని.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పద్మ అవార్డులలో రాష్ట్రం పై కేంద్రం వివక్ష చూపించిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లు కేంద్రం పరిశీలించి.. అర్హులకే అవార్డులు ఇస్తుందని.. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే పద్మ అవార్డులు ఇవ్వరు అన్నారు.
సొమ్ము ఒకరది సోకు మరొకరిది
మా నిధులతో పథకాలకు ఇందిరాగాంధీ, ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీమ్ అని పెట్టుకోండి..
నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వం.. పేరు మార్చుకుని మరో పెట్టుకునేది రాష్ట్ర ప్రభుత్వాలా?
– కేంద్ర మంత్రి బండి సంజయ్#bandisanjay #bjp #TelanganaCongress… pic.twitter.com/NiVf09v0oi
— Pulse News (@PulseNewsTelugu) January 27, 2025