మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ సోమవారం హైకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల తనపై నమోదైన కేసు కొట్టివేయాలని ఆయన కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇటీవల మేడ్చల్ జిల్లాలోని నిరుపేదల భూములను ఓ ల్యాండ్ బ్రోకర్ కబ్జా చేయడమే కాకుండా అందులో వెంచర్ వేశాడు.
దీంతో బాధితులు ఎంపీకి విన్నవించుకోగా.. ఆయన అప్పటికే ఫోన్ ద్వారా ల్యాండ్ బ్రోకర్‌ను హెచ్చరించినా వినిపించుకోలేదు. దీంతో తన అనుచరులతో కలిసి స్పాట్‌కు వెళ్లిన ఎంపీ ఈటల.. బ్రోకర్ మీద చేయి చేసుకున్నాడు. ఆయన అనుచరులు సైతం అతనిపై దాడి చేశారు. దీంతో పోచారం పీఎస్‌లో ఈటెల రాజేందర్‌పై బాధితుడి ఫిర్యాదు మేరకు పలు కేసులు నమోదయ్యాయి.ఈ క్రమంలోనే పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఈటెల రాజేందర్ పిటిషన్ వేయగా.. కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.