Tirumala: టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు

-

Abolition of reverse tendering system in TTD: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు. రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేస్తూ టీటీడీ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది.

18 hours time for Sarvadarshan of Tirumala Srivari

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలతో టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేసినట్లు ప్రకటించారు టీటీడీ ఈవో శ్యామలరావు. గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానం రద్దును చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామల రావు.

ఇక అటు తిరుమలకు వచ్చే వీఐపీలకు చంద్రబాబు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలని ఆదేశించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించ కూడదు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలని తెలిపారు….ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని కోరారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news