ఈఎస్ఐ స్కాం: రహస్య ప్రదేశం… కీలక సమాచారం!

-

వైకాపా నేతలు చెబుతున్నట్లుగా చంద్రబాబు భవిష్యత్తు అచ్చెన్నాయుడి చేతిలో ఉందో లేదో తెలియదు కానీ… ఈఎస్ఐ స్కాంలో అరెస్టుకాబడిన మరో నలుగురు నిందితుల చేతిలోనే అచ్చెన్నాయుడి భవిష్యత్తు ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. తెలుస్తోన్న సమాచారం మేరకు… రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న నలుగురు నిందితులను విజయవాడకు తీసుకొచ్చారంట ఏసీబీ అధికారులు. అనంతరం వారిని రహస్య ప్రదేశంలో విచారించినట్లు తెలుస్తోంది. అయితే రహస్య ప్రదేశం కావడం వల్ల స్వేచ్ఛగా విచారించారో ఏమో కానీ.. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అచ్చెన్నాకు ఎదురవ్వబోయే ప్రశ్నలు ఈ సమాచారం ఆధారంగానే ఉండబోతున్నాయని అంటున్నారు!

ఈఎస్ఐ అవినీతి కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీభీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. అచ్చెన్నను తమ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోరినా… ఆయన ఆరోగ్యం దృష్ట్యా అచ్చెన్నను ఆస్పత్రిలోనే విచారించాలని కోర్టు సూచించింది. దీంతో తన తరుపు న్యాయవాది, ఒక ప్రభుత్వ వైద్యుడి ఆధీనంలో అచ్చెన్న విచారణ జరుగుతుంది. గుంటూరు జీజీహెచ్ ‌లో అచ్చెన్నను కస్టడీలోకి తీసుకున్న అధికారులు దాదాపు మూడు గంటలపాటు ప్రశ్నించారు. డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో తొలిరోజు విచారణ ముగిసింది. ఇదే క్రమంలో నేడు, రేపు కూడా ఏసీబీ అధికారులు అచ్చెన్నను విచారించనున్నారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యంగానే ఉన్నారని, విచారణకు బాగానే సహకరించారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అయితే… ఈ విషయంలో అచ్చెన్నాయుడిని ఇంకా రెండు రోజుల పాటి ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ విషయంలో అచ్చెన్నను అధికారులు అడిగే ప్రశ్నలు అన్నీ.. చాలా వరకూ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన నిందితుల నుంచి రాబట్టిన సమాచారం మేరకే అని తెలుస్తోంది. ఈ విషయంలో వారి సమాధానాలకు, అచ్చెన్న ఆన్సర్స్ కి పొంతన కుదిరిందా, కుదరలేదా అనే విషయంపై అచ్చెన్న భవిష్యత్తు ఉండబోతుందని అంటున్నారు. ఏది ఏమైనా… అచ్చెన్నతో పాటు అరెస్టయిన నలుగురు నిందితుల విచారణ, వారిస్తున్న సమాచారం ఈ కేసులో కీలకంగా మారబోతుందని, అచ్చెన్న భవిష్యత్తు వారిస్తున్న సమాచారం మేరకే ఉండబోతుందని అంటున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news