చంద్రబాబు ఆరోగ్యంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు ఆరోగ్యంపై అచ్చెన్నాయుడు సంచలన కామెంట్లు చేశారు.  చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడి చేయకుండా ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు సొంత డాక్టర్లను ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు సంప్రదించ లేదు..? చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్లు చెబుతామన్నా.. వద్దని పోలీసులు ఒత్తిడి తెచ్చారు.చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు చెప్పొద్దని డాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది.చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత డాక్టర్ల బృందాన్ని పంపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్సు ఆస్పత్రికి చంద్రబాబును తరలించాలి. ప్రభుత్వం మీద.. ప్రభుత్వ ఆస్పత్రుల మీద మాకు నమ్మకం లేదు. చంద్రబాబుకు స్టెరాయిడ్లిచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే కుట్ర జరుగుతోంది.

చంద్రబాబుకు ఏదైనా జరిగితే కర్త, ఖర్మ, క్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే. చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపారు. 34 రోజులుగా జైల్లో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యం.. భద్రత విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మేం చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు అనారోగ్యం బారిన పడ్డారు. ఆరోగ్య క్రమశిక్షణ పాటించడం వల్లే 73 ఏళ్లున్నా 20 ఏళ్ల యువకుడిలా చంద్రబాబు పని చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు డీహైడ్రేషన్ బారిన పడ్డారు. చంద్రబాబుకున్న స్కిన్ ప్రాబ్లం వల్ల ఏసీ తప్పనిసరి. కనీసం వేడి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. డీహైడ్రేషన్, స్కిన్ ప్రాబ్లం వల్ల చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో పడింది. చంద్రబాబు ఒకేసారి ఐదు కేజీల బరువు తగ్గారు. బరువు తగ్గితే శరీరంలోని అన్ని అవయవాలపై పడుతుందని డాక్టర్లు చెబుతున్నారని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version