కర్నూలు జిల్లా ఆదోని వైసిపి అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వను దర్శించుకున్న సాయి ప్రసాద్ రెడ్డి…అనంతరం మీడియాతో మాట్లాడారు. వెయ్యికి వెయ్యి శాతం వైసిపి విజయ ఢంకా మోగిస్తామన్నారు. ఎన్నికల్లో మహిళలు , మైనార్టీలు నాకు సహకరించారన్నారు సాయి ప్రసాద్ రెడ్డి.

ఊరికి ఉపకారం శవానికి సింగారం చెయ్యరాదని వెల్లడించారు. ప్రజలకు మోసం చేసింటే నా వంశం నిర్వీర్యం అవ్వని అంటూ హాట్ కామెంట్స్ చేశారు. భూకబ్జాలకు పాల్పడి ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థిని ప్రజలు ప్రశ్నించక పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు సియం రిలీఫ్ ఫండ్ అందించామని వివరించారు సాయి ప్రసాద్ రెడ్డి.