భూమా కుటుంబంతో అఖిల ప్రియకు సంబంధం లేదు.. భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి

-

భూమా అఖిలను వ్యతిరేకంగా సమీప కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. తాజాగా భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. భూమా కుటుంబంతో అఖిల ప్రియకు సంబంధం లేదు అన్నారు. మా భూమా కుటుంబం అంత కిషోర్ కె మద్దతు.. అఖిలకు మద్దతు ఇచ్చేదే లేదు అన్నారు భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి. అఖిల ప్రియ భూమా కుటుంబానికి చెందినది కాదు, తన భర్త మద్దూర్ కుటుంబానికి చెందినది అన్నారు.

భూమా కుటుంబం నుంచి MLA గా బరిలో ఉండేది నేనే.. పిబ్రవరి 7 లేదా 9 నుండి ప్రజల్లోకి ప్రచారానికి సిద్దం..ఆళ్లగడ్డ బీజేపీ ఇంచార్జ్ భూమా కిషోర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్దూరు అఖిల ప్రియ, భార్గవ్ రామ్ నాయుడు తో సంబంధం లేదు అని భూమా కిషోర్ రెడ్డి తెలిపారు. భూమా కుటుంబం అంటే మేమే, మద్దూరు అఖిల ప్రియ కాదు.మద్దూరు అఖిల ప్రియ చేసిన ఘోరాలు అందరికీ తెలుసు అందుకే ఆమెను మా ఫ్యామిలీ పక్కన పెట్టారు. పొత్తులో భాగంగా బీజేపీ అధిష్ఠానం నాకు ఇవ్వకపొతే ఇండిపెండెడ్ గా అయినా పోటీ చేస్తా కానీ, అఖిల ప్రియకు మద్దతు ఇవ్వమని కిషోర్ రెడ్డి పేర్కొనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version