ఏపీ విద్యార్థులకు అలర్ట్..18 నుంచి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు జరుగనున్నాయి. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కౌన్సిలింగ్ ను జూన్ 18 నుంచి 29 వరకు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి ప్రాథమికంగా నిర్ణయించింది.
AICTE అనుమతి పొందిన కాలేజీల్లోనే బీసీఏ, బీబీఏ కోర్సులను కౌన్సెలింగ్ లో చేర్చనుంది. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ చేపట్టనుంది. ఈ లోపు అనుబంధ గుర్తింపు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీల అనుమతుల పొడిగింపు ఫీజులు చెల్లించాలని కాలేజీలకు వర్సీటీలు సూచించాయి.
అటు జేఎన్టీయూలో ఏపీ ఈసెట్ 2024(ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. ఈసెట్ ఫలితాలలో విద్యార్ధినులు 93.34 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ప్రకటించారు.