భారత ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం అయిపోయిందనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత.. జులై 1 నుంచి కొత్త కోచ్ బాధ్యతలు చేపడతాడని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులు ఎవరు దరఖాస్తు చేశారనేది ఇంకా తెలియలేదు. కానీ కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆ టీమ్ మెంటార్ గంభీర్ను హెడ్ కోచ్గా నియమించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు గౌతమ్ గంభీర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు బ్రేక్ వేశారు. గంభీర్ ఈసారి కోచ్‌గా వచ్చేందుకు మొగ్గు చూపడం లేదని ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే?
తమ టీమ్ (కేకేఆర్) ఇప్పటికి మూడు టైటిళ్లను సాధించామని.. ముంబయి, చెన్నై కంటే ఇంకా రెండు కప్‌లను వెనుకబడే ఉన్నామని గంభీర్ అన్నారు. ఇప్పుడు విజేతలుగా నిలిచినా.. తమ టైటిళ్ల వేట కొనసాగుతుందని.. ఇంకో మూడుసార్లు గెలిచి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్ల జాబితాలో చేరాలనేదే తమ తదుపరి లక్ష్యమని గంభీర్ తన నెక్స్ట్ టార్గెట్ గురించి చెప్పారు. దీంతో ఇక గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ పదవికి మొగ్గుచూపరని నెటిజన్లు భావిస్తున్నారు.