ఏపీలో టెన్త్, ఇంటర్లో ఫెయిలైన వారికి అలర్ట్. టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలై, సప్లిమెంటరీలోను ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ ఏడాది స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. సాధారణంగా సప్లిమెంటరీలో పాస్ అయితే సర్టిఫికెట్ లో కంపార్ట్మెంటల్ అని ఇస్తున్నారు.
అయితే ఫెయిల్ అయిన వారు స్కూలు, కాలేజీలకు వెళ్లి అన్ని సబ్జెక్టులు చదివి… పరీక్షలు రాసి పాస్ అయితే రెగ్యులర్ గా పరిగణిస్తామని మంత్రి బొత్స తెలిపారు. ఇక అటు అకడమిక్ క్యాలెండర్ 2023–24 ను విడుదల చేసిన సీఎం జగన్… జూన్ 12న తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్ వంటి అంశాలతో అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు.