దేశంలోని మహిళలకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6,000 ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది కేంద్రం. ‘మిషన్ శక్తి’ పథకం కింద రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.6,000 సాయంగా ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం PMVY కింద తొలికాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుడితే మూడు దశల్లో రూ. 5000 ఇస్తున్నారు. రెండో కాన్పుకు డబ్బులు అందేవి కాదు. తాజాగా దీన్ని సవరిస్తూ రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ. 6000 ఇవ్వనున్నారు. కవలలు జన్మించి అందులో ఒక అమ్మాయి ఉన్న ఈ పథకం వర్తిస్తుంది. ఇక ఈ పథకాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ అధిష్టానం కూడా నేతలకు దిశానిర్ధేశం చేసింది.