తిరుమల భక్తులకు అలర్ట్…10 రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు

-

తిరుమల శ్రీ వారి భక్తులకు బిగ్‌ అలర్ట్…10 రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు కానున్నాయి. జనవరి 10 నుంచి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. ఈ తరుణంలోనే పది రోజులు పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు కానున్నాయి.

Alert to Tirumala devotees special darshans canceled for 10 days

పది రోజులు పాటు సిఫార్సు లేఖలు స్వీకరణ రద్దు కానున్నాయి. ఏకాదశి పర్వదినం రోజున మాజీలకు విఐపి దర్శనాలు రద్దు అవుతాయి. ఇక అటు ఇవాళ దర్శనాలకు 12 గంటల సమయం పడుతోంది. తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,160 మంది భక్తులు దర్శించుకున్నారు. 22, 724 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు.

  • తిరుమల..18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వ దర్శనానికి 12 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,160 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 22, 724 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.47 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news