తెలంగాణ కేబినేట్ సమావేశానికి ముహుర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉండనుంది. రైతు భరోసా విధివిధానాలు, కొత్త రెవెన్యూ చట్టం ROR బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగనుంది.
ఇద్దరికి మించి పిల్లలున్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీ రాజ్ చట్టసవరణ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా… తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి తిరిగి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్నారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సభ. ఇంద్ర సేనారెడ్డికి సంతాపం తెలపనుంది శాసన మండలి. అనంతరం రెండు బిల్లులను ఆమోదించనుంది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ.