రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా 2024లో ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు అమిత్ షా తో చర్చల అనంతరం టీడీపీ కీలక నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పొత్తుల గురించి వివరించారు.

వీటిలో ప్రధానంగా రాష్ట్రానికి మేలు జరిగేవిధంగా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అమిత్ షాతో చర్చల అనంతరం చంద్రబాబు ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  పొత్తు ఆవశ్యకతకు ప్రజలకు వివరించే బాధ్యతను టీడీపీ ముఖ్యనేతలకు అప్పగించారు చంద్రబాబు. పొత్తులకు సంబంధించి రాజకీయంగా కొన్ని సీట్లను కోల్పోతామని.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పొత్తులు పెట్టుకున్నామని సీనియర్లు ఈ అంశంపై కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఏపీకి సంబంధించి కీలక ప్రకటన చేస్తుందనే భావన కనిపిస్తోంది. అమరావతి రాజధాని, ప్రత్యేక విశాఖ రైల్వే జోన్, పోలవరం కి సంబంధించి కొన్ని ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ. 

Read more RELATED
Recommended to you

Exit mobile version