కృష్ణానదికి భారీగా వరదనీరు భారీగానే వస్తోంది. ఈ తరుణంలోనే… అమరావతి అమరేశ్వరాలయం దాటి ప్రవహిస్తోంది వరద నీరు. పల్లపు వీధి, ముస్లిం కాలనీ లోకి చొచ్చుకెళ్ళింది వరద. రహదారులపై నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచింది. ఈ తరుణంలోనే… పడవల సాయంతో వీధుల్లో తిరుగుతున్నారు స్ధానికులు.
అమరావతి పోలీస్ స్టేషన్ లోకి వచ్చింది వరద నీరు. అమరావతి పోలీస్ స్టేషన్ ను, చుట్టూ ముట్టిన వరద నీరు..లోపలికి కూడా వచ్చింది. ఇంతవరకు గతంలో ఎప్పుడూ కూడా, ఇలాంటి పరిస్థితి రాలేదని చెబుతున్నారు స్థానికులు. అడుగు బయటకు వేయాలంటే, భయపడుతున్నారు అమరావతి స్థానికులు.