ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడు ఏం చేసినా…అది హల్ చల్ అవుతూనే ఉంది. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడల్లా…డాన్సులు చేస్తూ కనిపిస్తారు మంత్రి అంబటి రాంబాబు. అయితే.. తాజాగా బులెట్ బైక్ పైన దర్శనం ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు బైక్ పై చక్కర్లు కొట్టారు.
ఈ సందర్భంగా సొంత నియోజక వర్గం సత్తెనపల్లి లో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ వేకువజామునే బుల్లెట్ బైక్ ఎక్కిన అంబటి స్థానికంగా ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు పురవీధుల్లో తిరిగారు. టీ స్టాల్ వద్ద ఉన్న ప్రజల తో మాటా మంతి కలిపిన మంత్రి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు మంత్రి అంబటి రాంబాబు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.