వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద చేస్తున్న పోస్టులను డీజీపికి ఇచ్చాం. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోరాం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మా సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారు. సుధారాణి అనే యువతిపై చిలకలూరిపేట సీఐ తీవ్రంగా దాడి చేసి కొట్టారు. దీనిపై కూడా డీజీపికి ఫిర్యాదు చేశాం అని అంబటి అన్నారు.
అలాగే YS జగన్, భారతి, విజయమ్మ, అవినాష్ రెడ్డి ఇతరుల పై తప్పుడు కేసులు పెట్టారు. ఆ వివరాలు కూడా డీజీపికి ఇచ్చాం. ఇక మా వారిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తాం అని పేర్కొన్నారు. అయితే ఆడబిడ్డ పై దాడులు జరిగితే సహించననే చంద్రబాబు.. సుధారాణి విషయంలో ఎలా స్పందిస్తారో వేచుచూస్తాం అని తెలిపారు. ఇక మా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రెండు రోజులు చూస్తాం. ఆ తర్వాత కోర్టును ఆశ్రయిస్తాం అని అంబటి రాంబాబు స్పష్టం చేసారు.