6 గ్యారంటీల అమలుపై తెలంగాణలో పాదయాత్ర చేసే దమ్ముందా : బండి సంజయ్

-

ఈరోజు కరీంనగర్ లోని మమతా థియేటర్ లో బీజేపీ కార్యకర్తలు, ఏబీవీపీ నాయకులతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన సినిమా హీరో రాకేశ్ వర్రె, దర్శక, నిర్మాతలు, సినిమా యూనిట్ సభ్యులను అభినందించారు. అనంతరం వారితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను కూడా దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version